ఆర్మూర్లో దొంగల బీభత్సం

 ఆర్మూర్లో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీపీ ఆఫీసుకు దగ్గరలో ఉన్న  కోటక్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. తర్వాత  ఐదు హోల్ సేల్ షాపుల్లో దొంగతనం చేశారు.

మెండోరా మండలం బుస్సాపూర్ లో బ్యాంకు దోపిడీ ఘటనను మరువకముందే మరో బ్యాంకులో దోపిడీకి దొంగలు ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. వరస దొంగతనాలు వ్యాపారులను, సామాన్య జనాన్ని భయపెడుతున్నాయి.