ఓటేసి పరాగ్వే జెండా చూపిన రాబర్ట్ వాద్రా.. నెటిజన్లు ఫైర్

ఓటేసి పరాగ్వే జెండా చూపిన రాబర్ట్ వాద్రా.. నెటిజన్లు ఫైర్

ఇండియా జెండా బదులు పరాగ్వే జెండా

న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకున్నానని సెల్ఫీ ట్వీట్‌‌ చేసిన కాంగ్రెస్‌‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌‌ వాద్రాను ఆ ట్వీట్‌‌ చిక్కుల్లో పడేసింది. ఇండియా జెండా బదులు పరాగ్వే జెండాను ట్వీట్‌‌ చేయటంతో నెటిజన్లు ఆయనపై ఫైర్‌‌‌‌ అయ్యారు. ఆరో విడత లోక్​సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాబర్ట్‌‌ వాద్రా “మన హక్కే మన బలం. ప్రతి ఒకరు ఓటు హక్కు వినియోగించుకోండి. మనం ఇష్టపడే వారి కోసం, సెక్యూలర్‌‌‌‌, సేఫ్‌‌ భవిష్యత్తు కోసం ఓటు వెయ్యండి” అంటూ పొరపాటున పరాగ్వే జెండాను పోస్ట్‌‌ చేశారు. దీన్ని గమనించిన నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేశారు. ‘మీరు వేరే దేశానికి చెందిన వారని నిరూపించారు’ అంటూ కామెంట్లు పెట్టారు. దాన్ని గమనించిన వాద్రా ఆ ట్వీట్‌‌ను డిలీట్‌‌ చేసి భారతదేశ జెండాను పెట్టి మరో ట్వీట్‌‌ చేశారు. అయితే ఈ లోపే ఆ మొదటి ట్వీట్‌‌ స్క్రీన్‌‌షాట్‌‌ వైరల్‌‌గా మారింది.