కరోనా డ్యూటీ ఎక్కిన రోబో

కరోనా డ్యూటీ ఎక్కిన రోబో

పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ సప్లై

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం రోబో సేవలను వినియోగించుకుంటోంది. ఎర్నాకుళం గవర్నమెంట్​ హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ పొందుతున్న పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ ను రోబోనే అందజేస్తోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు చెందిన విశ్వశాంతి ఫౌండేషన్ ఈ అటానమస్ రోబోను ఎర్నాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చింది. ‘కర్మీ–బాట్’ (KARMI BOT)గా పిలిచే ఈ రోబో శనివారం నుంచి డ్యూటీలో చేరిందని, దీన్ని అసిమోవ్ కంపెనీ డెవలప్ చేసిందని ఎర్నాకుళం జిల్లా అధికారులు తెలిపారు. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందజేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వైరస్ సోకకుండా నివారించేందుకు రోబో సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పేషెంట్లు, హెల్త్ సిబ్బందికి మధ్య ఇంటరాక్షన్ ను తగ్గించడం, పీపీఈ కిట్ల కొరత కారణంగా వాటి వినియోగాన్ని తగ్గించడమే దీని ప్రధాన ధ్యేయమన్నారు. పేషెంట్లకు ఫుడ్, మెడిసిన్స్ అందజేయడం, చెత్తను సేకరించడం, డిసిన్ఫెక్టెంట్స్ ను స్ర్పే చేయడం, డాక్టర్లు, పేషెంట్లకు మధ్య వీడియో కాల్ చేయడం… రోబో మెయిన్ డ్యూటీలు. 25 కిలోల పే లోడ్ కలిగిన ఈ రోబో మ్యాగ్జిమమ్ స్పీడ్ సెకన్ కు ఒక మీటర్.

For More News..

PM కిసాన్ కొత్త లిస్టు విడుదల.. మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

కరోనా కట్టడి కోసం 11 బృందాలు

సౌదీలో ఆ శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు