ఇండియా–కివీస్ సెమీస్ అంపైర్లుగా టకర్, ఇల్లింగ్‌‌వర్త్

ఇండియా–కివీస్ సెమీస్ అంపైర్లుగా టకర్, ఇల్లింగ్‌‌వర్త్

దుబాయ్: వన్డే వరల్డ్ కప్‌‌లో భాగంగా బుధవారం వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్‌‌ జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌‌కు రాడ్‌‌ టకర్, రిచర్డ్‌‌ ఇల్లింగ్‌‌వర్త్‌‌  ఆన్‌‌ ఫీల్డ్‌‌ అంపైర్లుగా ఎంపికయ్యారు. జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్‌‌‌‌గా, అడ్రియన్ హోల్డ్‌‌స్టాక్‌‌ ఫోర్త్ అంపైర్‌‌‌‌గా పని చేస్తాడు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్‌‌ రిఫరీగా వ్యవహరిస్తాడు. మరోవైపు  గురువారం కోల్‌‌కతాలో ఆస్ట్రేలియా–సౌతాఫ్రికా మధ్య జరిగే  రెండో సెమీస్‌‌లో నితిన్ మేనన్, రిచర్డ్‌‌ కాటిల్‌‌బరో అంపైర్లుగా ఉంటారు.  

క్రిస్ గఫానీ, మైకేల్‌‌ గాఫ్​ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా, జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు. కాగా2019  వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా–కివీస్ సెమీస్‌‌కు కూడా ఇల్లింగ్‌‌వర్త్‌‌ ఆన్‌‌ ఫీల్డ్ అంపైర్‌‌‌‌గా ఉండగా.. టకర్ థర్డ్ అంపైర్‌‌‌‌గా పని చేశాడు. తాజాగా ఇండియా-–కివీస్ సెమీస్‌‌ మ్యాచ్​అంపైర్‌‌గా టకర్‌‌‌‌కు వందో వన్డే కానుంది.