డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్​కు నీరజ్‌‌

డైమండ్‌‌ లీగ్‌‌  ఫైనల్​కు నీరజ్‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా.. డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్​కు అర్హత సాధించాడు.  గత మూడు డైమండ్‌‌ లీగ్‌‌ మీట్స్​లో  23 పాయింట్లు సాధించిన చోప్రా మూడో ప్లేస్‌‌తో క్వాలిఫై అయ్యాడు. జాకుబ్‌‌ వాడ్లెచ్‌‌ (29), జూలియన్‌‌ వెబెర్‌‌ (25) తొలి రెండు ప్లేస్‌‌ల్లో ఉన్నారు. దోహా (మే 5), లుసానే (జూన్‌‌ 30) ఈవెంట్స్‌‌లో గోల్డ్‌‌తో మెరిసిన నీరజ్‌‌.. గురువారం అర్ధరాత్రి జరిగిన జూరిచ్‌‌ ఈవెంట్‌‌లో సిల్వర్‌‌తో సంతృప్తి పడ్డాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నీరజ్‌‌ ఈటెను 85.71 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. 

తొలి ప్రయత్నంలో 80.79 మీటర్ల దూరం నమోదు చేసిన నీరజ్‌‌ రెండో ప్లేస్‌‌ సాధించినా, తర్వాతి రెండు రౌండ్లలో ఫౌల్‌‌ అయ్యాడు. దీంతో ఐదో ప్లేస్‌‌కు పడిపోయాడు. జర్మన్‌‌ త్రోయర్‌‌ జూలియన్‌‌ వెబెర్‌‌ ఆధిక్యంలోకి వచ్చాడు. నాలుగో ప్రయత్నంలో నీరజ్‌‌ 85.22 మీటర్లతో మళ్లీ రెండో ప్లేస్‌‌కు దూసుకొచ్చాడు. ఐదో ప్రయత్నంలో ఫౌల్‌‌ అయినా ఆఖరి అటెంప్ట్‌‌లో ఈటెను 85.71 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు. ఈ నెల 17న యుగెన్‌‌లో జరిగే డైమండ్‌‌ లీగ్‌‌ చాంపియన్స్‌‌ ట్రోఫీ గెలవడమే తన ముందున్న లక్ష్యమని నీరజ్‌‌ తెలిపాడు. అలాగే పారిస్‌‌ ఒలింపిక్స్‌‌తో పాటు 2025 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌ను నిలబెట్టుకునేందుకు శాయశక్తుల  కృషి చేస్తానన్నాడు.