భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించారు. లేటెస్ట్ గా ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్న ఆయన అత్యధిక వయసు(43)లో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా నిలిచారు. తన పార్ట్ నర్ మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఫైనల్లో 7-6(7-0)7-5 తో ప్రత్యర్థి జోడిని మట్టికరిపించారు. అటు లియాండర్ పేస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో భారత ఆటగాడిగానూ బోపన్న ఘనత సాధించారు.
2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి బోపన్న ఇంతకు ముందు గ్రాండ్‌స్లామ్ విజయం సాధించాడు.బోపన్నకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
