కోహ్లీ రికార్డు బద్దలు

కోహ్లీ రికార్డు బద్దలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మరో రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ ఈ రికార్డును సాధించాడు.  అత్యధిక సిక్సులు కొట్టిన రెండో  భారత కెప్టెన్గా రోహిత్ శర్మ అవతరించాడు. ఈ మ్యాచ్ కు ముందు 132 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ..చివరి వన్డేలో 6 సిక్సర్లు బాదడం ద్వారా కోహ్లీ రికార్డును సమం చేశాడు. భారత కెప్టెన్గా కోహ్లీ 138 సిక్సర్లు కొట్టగా..రోహిత్ శర్మ కూడా 138 సిక్సర్లు బాదాడు. 

భారత కెప్టెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో కెప్టెన్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 211 సిక్సర్లతో నెంబర్ వన్ ప్లేస్లో ఉండగా.. మహ్మద్ అజారుద్దీన్ 61 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.