రోహిత్..సూపర్ హిట్

రోహిత్..సూపర్ హిట్

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌‌‌‌లో ఇండియా పట్టు బిగిస్తోంది. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (256 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 127) సూపర్‌‌‌‌ సెంచరీతో.. మ్యాచ్‌‌‌‌లో ఆధిక్యంలోకి వచ్చేసింది. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (46), పుజారా (61) కూడా చేయి వేయడంతో.. శనివారం థర్డ్‌‌‌‌ డే ఆట ముగిసే టైమ్‌‌‌‌కు టీమిండియా సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 92 ఓవర్లలో 3 వికెట్లకు 270 రన్స్‌‌‌‌ చేసింది. కోహ్లీ (22 బ్యాటింగ్‌‌‌‌), జడేజా (9 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 171 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో ఉంది. 

రోహిత్​.. సూపర్‌‌‌‌ హిట్‌‌‌‌

43/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా ఓపెనర్లు రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఓవర్‌‌‌‌కాస్ట్‌‌‌‌ కండిషన్స్‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌ పేస్‌‌‌‌ త్రయం అండర్సన్‌‌‌‌, రాబిన్సన్‌‌‌‌ (2/67), వోక్స్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సెషన్‌‌‌‌ మొత్తం ముంబైకర్‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌గా బ్యాటింగ్‌‌‌‌ చేస్తూ రన్స్‌‌‌‌ రాబట్టాడు.  ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ లక్ష్యంగా, శరీరానికి దగ్గరగా వచ్చిన చాలా బాల్స్‌‌‌‌ను వదిలేస్తూ ముందుకు సాగాడు. రాహుల్‌‌‌‌ కూడా రాబిన్సన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌తో ఓ ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌ బాదాడు. ఈ క్రమంలో ఎల్బీ అప్పీల్‌‌‌‌ నుంచి కూడా బయటపడ్డాడు. జోరుమీదున్న రాహుల్‌‌‌‌ను 34వ ఓవర్‌‌‌‌లో అండర్సన్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు చేర్చడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 83 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన పుజారా సాలిడ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌తో అండగా నిలవడంతో లంచ్‌‌‌‌ టైమ్‌‌‌‌కు ఇండియా 108/1 స్కోరు చేసింది. 

నో వికెట్‌‌‌‌..

సెకండ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌ బౌలర్లు ఎంత కష్టపడినా.. రోహిత్‌‌‌‌, పుజారా వికెట్‌‌‌‌ ఇచ్చుకోలేదు. పిచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలంగా మారుతుండటంతో.. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌  తన స్వభావానికి విరుద్ధంగా ఆడుతూ ఓపికగా ఇన్నింగ్స్‌‌‌‌ నిర్మించాడు. హాఫ్‌‌‌‌ సెంచరీ తర్వాత ఒకటి, రెండుసార్లు ముంబైకర్‌‌‌‌ ఏకాగ్రత తప్పాడు. వోక్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో తప్పుడు ఫుట్‌‌‌‌వర్క్‌‌‌‌తో బాల్స్‌‌‌‌ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో స్లిప్‌‌‌‌లో క్యాచ్‌‌‌‌లు లేచినా.. బర్న్స్‌‌‌‌ అందుకోలేకపోయాడు. చివరకు 94 పరుగుల వద్ద స్పిన్నర్‌‌‌‌ మొయిన్‌‌‌‌ అలీ బాల్‌‌‌‌ను భారీ సిక్సర్‌‌‌‌గా మలిచి సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఇది ఎనిమిదో శతకం కాగా, విదేశాల్లో ఫస్ట్‌‌‌‌. రెండో ఎండ్‌‌‌‌లో పుజారా కూడా కౌంటర్‌‌‌‌ అటాక్‌‌‌‌కు దిగడంతో ఇండియా 199/1తో టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లింది. అప్పటికి లీడ్‌‌‌‌ 100 రన్స్‌‌‌‌కు చేరుకుంది. టీ తర్వాత మరో పది ఓవర్లు నిలకడగా ఆడిన రోహిత్‌‌‌‌ దురదృష్టవశాత్తూ కొత్త బాల్‌‌‌‌కు వెనుదిరిగాడు. 81వ ఓవర్‌‌‌‌లో రాబిన్సన్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఫుల్‌‌‌‌ చేసిన రోహిత్‌‌‌‌.. ఫైన్‌‌‌‌ లెగ్‌‌‌‌లో వోక్స్‌‌‌‌ రన్నింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు ఔటయ్యాడు. సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 153 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. మరో ఐదు బాల్స్‌‌‌‌ తర్వాత పుజారా కూడా ఔట్‌‌‌‌కావడంతో ఇండియా స్కోరు 237/3గా మారింది. ఈ దశలో వచ్చిన కోహ్లీ, జడేజా మరో వికెట్‌‌‌‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే బ్యాడ్‌‌‌‌లైట్‌‌‌‌ కారణంగా ఆటను ముందుగానే ఆపేశారు.