
బెంగళూరు: ఎన్‌సీఏలో పునరావాసంలో ఉంటున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడు. శుక్రవారం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాస్ అయ్యాడు. ఐపీఎల్ పదమూడో సీజన్‌లో రోహిత్ హ్యామ్‌స్ట్రింగ్‌కు గాయమైంది. గత నెల 19 నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రోహిత్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. తాజాగా ఫిట్‌నెస్ టెస్టు పాసవ్వడంతో ఈ నెల 13న (ఆదివారం) రోహిత్‌ను ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ నిర్ణయించిందని సమాచారం. ఈ విషయం పై బోర్డు నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లినా తొలి టెస్టుకు మాత్రం అందుబాటులో ఉండే చాన్సెస్ తక్కువే. 14 రోజుల క్వారంటైన్ రూల్స్ దృష్ట్యా కొన్ని మ్యాచులకు అతడు దూరమవ్వొచ్చు. రోహిత్ క్వారంటైన్ వ్యవధిని తగ్గించేలా ఆసీస్ మినహాయింపునిస్తే రెండో టెస్టులో రోహిత్ పాల్గొనే అవకాశాల్ని కొట్టిపారేయలేం. అయితే రోహిత్ కోలుకున్నప్పటికీ అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా అనేది చెప్పలేం.