టీ20 వరల్డ్ కప్ గెలవాలంటూ ప్రత్యేక పూజ

టీ20 వరల్డ్ కప్ గెలవాలంటూ ప్రత్యేక పూజ

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా ఒకే ఒకసారి వరల్డ్ కప్ గెలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్ను తొలిసారి ఐసీసీ ప్రవేశపెట్టగా...తొలి వరల్డ్ కప్ లోనే భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ సాధించలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా కప్పుకొట్టాలని ఆటగాళ్లు కసితో బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ కప్ సాధించే శక్తినివ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. 

విఘ్నాలు తొలగాలని పూజలు..
విజయదశమి సందర్బంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న ఆకాంక్షతో వినాయకుడిని ప్రార్థించినట్లు చెప్పాడు. రోహిత్ శర్మ తన సతీమణి రితికా, కూతురు సమైరతో కలిసి పూజల్లో పాల్గొన్నాడు. 

ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిన భారత్..
టీ20ప్రపంచకప్‌ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది.  ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్  అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఆడనుంది.  సూపర్ 12కు ముందు భారత జట్టు..రెండు వార్మప్ మ్యాచ్‌లు  ఆడనుంది. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న న్యూజిలాండ్‌తో బరిలోకి దిగనుంది.