
ముంబై: ఆస్ట్రేలియా టూర్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు. శుక్రవారం శివాజీ పార్క్‌లో ఇండియా మాజీ కోచ్, తన ఫ్రెండ్ అభిషేక్ శర్మతో కలిసి రెండు గంటల పాటు చెమటోడ్చాడు.
ముంబై క్రికెటర్ అంగ్‌క్రిష్ రఘువంశీతో పాటు కొంత మంది లోకల్ ప్లేయర్లు కూడా ఈ సెషన్‌లో పాల్గొన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ మళ్లీ బరిలోకి దిగలేదు. ఇప్పటికే టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్ వన్డే కెరీర్‌ను సెలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ సిరీస్ తర్వాత వీరిద్దరి ఫ్యూచర్‌పై కాస్త సందిగ్ధత తొలగనుంది.