రొమాంటిక్‌ మూవీ రివ్యూ

రొమాంటిక్‌ మూవీ రివ్యూ

నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ తదితరులు
ఎడిటర్ : జునైడ్
కెమెరామెన్ : నరేష్
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
దర్శకుడు: అనీల్ పాడురి
విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021


గోవా డ్రగ్ మాఫియా నేపథ్యం లో ఈ రొమాంటిక్ చిత్రం కథ ఉంటుంది. వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఈ చిత్రం లో ఒక స్ట్రీట్ రఫియాన్. డబ్బు కోసం..తన బామ్మ కల నెరవేర్చడం కోసం అండర్ వరల్డ్ లోకి అడుగు పెట్టి డాన్ గా మారుతాడు. తర్వాత మోనికా (కేతిక శర్మ) అనే యువ సంగీత విద్వాంసురాలి అందానికి ఫిదా అయితాడు. కొన్ని సంఘటనల తర్వాత ఆకాష్ ఒక ఎస్ఐ ని చంపుతాడు.ఇదే సమయం లో ఒక క్రూరమైన ఏసీపీ రమ్య (రమ్య కృష్ణ) వాస్కో ను పట్టుకోవడానికి ముంబై నుండి గోవా కి బదిలీ అయితుంది. రమ్య కృష్ణ తను అనుకున్న పనిని సాధిస్తుందా? వాస్కో ,మోనికా ల రిలేషన్ షిప్ ఏమవుతుంది? అన్నదే ఈ మూవీ స్టోరీ.

న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్:
ఆకాష్ నటన పరంగా ఇంప్రూవ్ అయ్యాడు.మంచి నటన ప్రదర్శించాడు.అందాల భామ కేతిక శర్మ..గ్లామర్ తో ఫిదా చేసింది.కుర్రాళ్లను కిరాక్ చేస్తుందని చెప్పాలి.రమ్య కృష్ణ సిన్సియర్ పోలీష్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది.మిగితా నటీనటులు తమ పాత్ర ల మేరకు నటించారు.


టెక్నిక‌ల్ వ‌ర్క్:
మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ సంగీతం సినిమాకు ప్లస్ గా నిలిచింది అని చెప్పాలి .పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెప్పించాడు. ఎడిటింగ్ బావుంది. సినిమాటోగ్రఫి కూడా పర్వాలేదు అనిపించింది.


విశ్లేష‌ణ:
పూరీ మార్క్ హీరోయిజంతో సినిమా సాగుతుంది.పూరీ తీసిన పాత స్టోరీలను మిక్స్ చేసి కొట్టారు. కథనంతో కూడా ఆకట్టుకోలేకపోయాడు డైరెక్టర్. ఆకాష్ పూరీ హీరోయిజం,కేతిక శర్మ అందం,సునీల్ కశ్యప్ పాటల కారణంగా..సినిమాకు కొన్ని మార్కులు పడతాయి.మొత్తానికి యూత్ ఆడియన్స్ ఓ సారి చూడాలనుకుంటే...చూడవచ్చు. కానీ మాములు ప్రేక్షకులు భరించలేరు. రొమాన్స్ కూడా హద్దులు దాటింది.

బాటమ్ లైన్ : యూతే టార్గెట్ గా రొమాంటిక్