IPL 2025: ఊరించి వదిలేస్తున్నాడు: ప్లే ఆఫ్స్‌కు ముందు RCB జట్టును వదిలి వెళిపోనున్న విండీస్ స్టార్

IPL 2025: ఊరించి వదిలేస్తున్నాడు: ప్లే ఆఫ్స్‌కు ముందు RCB జట్టును వదిలి వెళిపోనున్న విండీస్ స్టార్

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు గాయాలతో ఇబ్బందిపడుతుండగా .. తాజాగా మరో వార్త ఆర్సీబీ జట్టును కలవరానికి గురి చేస్తోంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. షెపర్డ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ విండీస్ ఆల్ రౌండర్ ఇటీవలే   ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వెస్టిండీస్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో స్వదేశానికి పయనం కాక తప్పట్లేదు. 

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. షెపర్డ్ ఒకవేళ ఐపీఎల్ కోసం జాతీయ జట్టును వదులుకుంటే 2027 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ను అతడిని పక్కన పెట్టే అవకాశం ఉంది. మే 21 నుంచి ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం (మే 6) తమ జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని విండీస్ క్రికెట్ బోర్డు ఇప్పటి నుంచే మంచి జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. 15 మంది స్క్వాడ్ లో షెపర్డ్ స్థానం దక్కించుకున్నాడు. 

►ALSO READ | పాకిస్థాన్ ఆకస్మిక దాడుల ఎఫెక్ట్.. అర్ధాంతరంగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

వెస్టిండీస్ మే 21- 25 మధ్య ఐర్లాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అదే సమయంలో ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరుగుతాయి.   క్వాలిఫైయర్ 1 మే 20న.. ఫైనల్ మే 25న జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో షెపర్డ్ సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.  ఈ సమయంలో ఆర్సీబీ ఆశాకిరణంలా మారిన ఈ విండీస్ ఆల్ రౌండర్ దూరమైతే ఆర్సీబీకి కొంత లోటనే చెప్పాలి. 

వెస్టిండీస్ వన్డే జట్టు:

షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్

ప్లేఆఫ్స్ కు ముందు RCB మ్యాచ్ లు

మే 9 vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

మే 13 vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

మే 17 vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)