అంగారకుడిపైకి రోవర్.. వీడియో రిలీజ్ చేసిన నాసా

అంగారకుడిపైకి రోవర్..  వీడియో రిలీజ్ చేసిన నాసా

మార్స్ పై జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒకప్పుడు పర్సెవరెన్స్ అనే రోవర్ ను దానిపైకి పంపింది నాసా. దానికి సబంధించిన వీడియోను ఇపుడు రిలీజ్ చేసింది. వీడియో మూడు నిమిషాల 25 సెకన్లుంది. వీడియోలో రోవర్ ల్యాండ్ అవుతున్న టైంలో అంగారకుడిపై దుమ్ము లేవడం, తాళ్ల సాయంతో స్పేస్ షిప్ నుంచి రోవర్ కిందకి దిగడం స్పష్టంగా కనిపించింది. ఈ అద్భుతమైన వీడియోను క్యాప్చర్ చేయడానికి రికార్డు స్థాయిలో 25 కెమెరాలను వాడారు సైంటిస్టులు. రోవర్ శుక్రవారమే అంగారకుడిపైకి చేరగా… రీసెంట్ గా వీడియో రిలీజ్ చేసింది నాసా.