బీఆర్ఎస్ హయాంలో మంథనిలో గూండా రాజ్యం నడిచింది : వివేక్ వెంకటస్వామి

 బీఆర్ఎస్ హయాంలో మంథనిలో గూండా రాజ్యం నడిచింది : వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పాలనలో మంథని అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంథని లో గూండా రాజ్యం నడిచిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు పెంచుకోవాలని అనుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పదేండ్లు అహంకారంతో పాలించారని ఫైర్ అయ్యారు. 

పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మంథని అభివృద్ధి జరిగిందని చెప్పారు. దివంగత నేత శ్రీపాదరావు పట్టుదలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయనను చూసి చాలా తెలుసుకున్నాని తెలిపారు. శ్రీధర్ బాబు కూడా మంథని కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్టే ఎంపీ ఎన్నికల్లో తన కొడుకుని ఆశీర్వదించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.