హత్య కేసులో రౌడీ షీటర్ అరెస్ట్

హత్య కేసులో రౌడీ షీటర్ అరెస్ట్

 

 

గండిపేట, వెలుగు : రౌడీ షీటర్ సర్వర్ హత్య కేసును రాజేంద్రనగర్  పోలీసులు చేధించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. రౌడీ షీటర్ ఖూనీ గౌస్ ను పోలీసులకు  పట్టించేందుకు రౌడీ షీటర్ సర్వర్ ప్లాన్ చేస్తున్నాడని అనుమానించాడు. నిందితుడు మరో ఇద్దరితో కలిసి సర్వర్ ను గత శుక్రవారం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని డైరీ ఫామ్​చౌరస్తా వద్ద దారుణంగా హత్య చేశారు. 

అయితే.. సర్వర్​ ను హత్య చేస్తానంటూ ముందుగానే నిందితుడు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా మరో ఇద్దరిని చంపి లొంగిపోతానంటూ చెప్పాడు. ఖూనీ గౌస్ ను అరెస్ట్ చేసి అతని వద్ద రెండు తల్వార్లు, బైక్ ను రాజేంద్రనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.