చైనా నుంచి భారత్‌కు సెక్స్ టాయ్స్ స్మగ్లింగ్!

చైనా నుంచి భారత్‌కు సెక్స్ టాయ్స్ స్మగ్లింగ్!
  • దారిలోనే సీజ్ చేసిన భూటాన్ పోలీసులు

చైనా సెక్స్ టాయ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను అరెస్టు చేశారు రాయల్ భూటాన్ పోలీసులు. బొలెరో కారులో భారీగా సెక్స్ టాయ్స్‌ను భారత్‌కు తరలిస్తుండగా దారిలోనే గుర్తించి సీజ్ చేశారు. చైనా నుంచి భూటాన్ సరిహద్దుల వరకు గుర్రాలపై తెచ్చి, అక్కడి నుంచి కార్లలో భారత్‌కు తరలిస్తున్నారు కొందరు దుండగులు. దీనిపై భూటాన్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. భారత్ వైపు వస్తున్న మూడు బొలెరోలను అడ్డగించారు. రెండింటిలో చైనా దుప్పట్లు ఉన్నాయి. మరో కారులో చైనాలో తయారు చేసిన వేలాది సెక్స్ టాయ్స్‌ను గుర్తించారు. దీంతో ఈ మూడు కార్లను శుక్రవారం సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని భూటాన్ పత్రిక ఎడిటర్ టెన్జింగ్ లమ్సాంగ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.