
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసు ఒక చిన్నారిని క్రూరమైన, శారీరక వేధింపులకు గురిచేశాడు. ఈ బాధాకరమైన సంఘటనను చూపే ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్నారిని ఎలాంటి కనికరం లేకుండా కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ హృదయ విదారక దృశ్యంలో ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న చిన్నారిగా తెలుస్తోంది. ఈ సంఘటన బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో RPF సిబ్బందిలో ఒకరు పిల్లవాడిని క్రూరంగా తన్నడం చూడవచ్చు. సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కారణమైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారి సస్పెండ్..
స్థానిక అధికారులు ఈ వీడియోను చూసి.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిపై చర్యలు తీసుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. అనంతరం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
बलिया में RPF के जवान द्वारा बच्चे को मारने का वीडियो,बच्चे को बेरहमी से मारने का वीडियो वायरल,रेलवे स्टेशन प्लेटफार्म पर सो रहा था बच्चा,बच्चे के शरीर पर पैर रखकर धकेला गया,बेल्थरा रेलवे स्टेशन का बताया जा रहा वीडियो. @RPF_INDIA @AshwiniVaishnaw pic.twitter.com/2KzQs99Bsl
— Vineet Gupta (@aapka_vineet) July 16, 2023