IPL 2026: అక్షర్ సేన గెలుపు బాట పట్టేనా..? ఢిల్లీ vs ఆర్ఆర్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్ ఇదే..!

IPL 2026: అక్షర్ సేన గెలుపు బాట పట్టేనా..? ఢిల్లీ vs ఆర్ఆర్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్ ఇదే..!

ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 1) మరో రసవత్తర పోరకు రంగం సిద్ధమైంది. జైపూర్‌లోని సాయివాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.  రాత్రి 7.30 గంటలకు ఈ ఆసక్తికర పోరు మొదలుకానుంది. టోర్నీలో జైత్రయాత్ర సాగిస్తోన్న పంజాబ్‎ను చిత్తు చేసి రాజస్థాన్ ఫుల్ జోష్‏లో ఉండగా.. సొంత గడ్డపై ఆర్సీబీ చేతిలో దారుణ ఓటమి చవిచూసి ఢిల్లీ తీవ్ర నిరాశలో ఉంది. 

ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన డీసీ మూడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ఫ్లే ఆఫ్స్‎కు చేరుకోవాలంటే రాజస్థాన్‎పై తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. దీంతో రాజస్థాన్‎పై ఎలాగైనా గెలిచి విజయాల బాట పట్టాలని డీసీ భావిస్తోంది. మరోవైపు.. ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన రాజస్థాన్ 6 విజయాలు సాధించి మూడింట్లో ఓడింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. డీసీపై గెలిచి ఫ్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తోంది. 

డీసీ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టూ హెడ్ రికార్డులు

ఐపీఎల్‎లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో 15 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏ జట్టుది అధిపత్యం లేదు. రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగానే ఉంది. శుక్రవారం (మే 1) జరిగే పోరులో విజయం సాధించిన జట్లు పై చేయి సాధిస్తోంది. 

టోర్నీలో జట్టు ప్రస్తుత ఫామ్‏ను బట్టి చూస్తే శుక్రవారం (మే 1) జరిగే మ్యాచులో రాజస్థాన్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ యంగ్ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైశ్వాల్ భీకర ఫామ్‎లో ఉన్నారు. మరోవైపు, గాయం కారణంగా టోర్నీకి దూరమైన డీసీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రాజస్థాన్‎తో జరగనున్న కీలక పోరులో బరిలోకి దిగిడం ఢిల్లీకి ఊరట కలిగించే అంశం. 

పిచ్ రిపోర్ట్:

ఢిల్లీ, రాజస్థాన్ తలపడనున్న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ నార్మల్‎గా బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికి సమతుల్యంగా ఉంటుంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా బాల్ ఎక్కువగా టర్న్ కావడంతో స్పిన్నర్లు రాణించగలరు. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఛేజింగ్ చేసే జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రౌండ్‎లో టాస్ గెలిచిన జట్లు తొలుత బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తాయి.