RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు

RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.. విదేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ సినిమా తాజాగా మరో దాన్ని ఖాతాలో వేసుకుంది.జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో ఔట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ అవార్డు దక్కించుకుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్: మావెరిక్ ను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెడ్ గ్లోబ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంది. మొత్తం 10 భారతీయ సినిమాలు ఆస్కార్ బరిలో ఉండగా.. నేడు నామినేషన్స్ ప్రకటించనున్నారు.