ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయిన నాటు నాటు సాంగ్

ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయిన నాటు నాటు సాంగ్

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజై దాదాపు 9నెలలవుతున్నా.. ఆ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. అందర్నీ ఒక ఊపు ఊపేసిన నాటు నాటు సాంగ్ అందర్లో ఎంత జోష్ ని నింపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ కు గుర్తింపు దక్కింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి నాటు నాటు సాంగ్  ఉత్తమ పాటల విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. మొత్తం 81 పాటలు పోటీపడగా వాటిలో ఎంపికైన 15 పాటల్లో ఈ పాట ఒకటి. నాటు నాటుతో పాటు ఈ జాబితాలోని అవతార్: ది వే ఆఫ్ వాటర్ నుండి 'నథింగ్ ఈజ్ లాస్ట్', బ్లాంక్ పాంథర్ నుండి 'లిఫ్ట్ మి అప్': వకాండ ఫరెవర్, టాప్ గన్: మావెరిక్ నుండి 'హోల్డ్ మై హ్యాండ్' ఉన్నాయి.

ఆస్కార్‌ నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను  ప్రకటించిన అకాడమీ...10 విభాగాలకు సంబంధించిన జాబితాలో 4 విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాన్ని దక్కించుకున్నాయి. కాగా ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ , ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్‌’ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. కాగా ఈ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.