
హైదరాబాద్ : సంచలన సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన బ్లాస్టింగ్ అప్ డేట్స్ ను చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రకటించింది. అత్యంత భారీ బడ్జెట్, తారాగణంతో ఈ సినిమా రూపొందుతోందని దర్శకుడు రాజమౌళి చెప్పారు. మూవీ నిర్మాణం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని అన్నారు. అన్ని భాషల్లోనూ కామన్ టైటిల్ ఆర్ఆర్ఆర్ గానే ఉంటుందనీ… దీనికి సంబంధించిన ఎక్స్ పాన్షన్ త్వరలో ప్రకటిస్తామన్నారు. సినిమాను వచ్చే ఏడాది 2020 జులై 30 నాడు విడుదల చేస్తామని చెప్పారు. ఒకేసారి పది భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. 1920ల్లో జరిగే కథ ఇది అని రాజమౌళి వివరించారు. 2020లో విడుదల చేయడం అంటే.. వందేళ్ల కిందట జరిగినట్టుగా అల్లుకున్న ఓ కథను వందేళ్ల తర్వాత విడుదల చేసినట్టుగా అనిపించడం యాదృచ్చికమే అన్నారు రాజమౌళి. విడుదల వాయిదాపడబోదని.. 2020లోనే వస్తుందని ప్రకటించారు.