రూ. 112 కోట్లు సేకరించిన స్క్వేర్ యార్డ్స్

రూ. 112 కోట్లు సేకరించిన స్క్వేర్ యార్డ్స్
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రాపర్టీ కొనేందుకే... 

న్యూఢిల్లీ: వాణిజ్య ఆస్తుల్లో  ఫ్రాక్షనల్​ ఓనర్​షిప్​( పాక్షిక యాజమాన్యాన్ని) పొందడానికి పెట్టుబడిదారులకు సహాయపడే వ్యాపారంలోకి ఇటీవల ప్రవేశించిన ప్రాప్‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ స్క్వేర్ యార్డ్స్  హై నెట్​వర్త్​ ఇండివిజువల్స్​(హెచ్​ఎన్​ఐ) నుంచి రూ.112 కోట్లు సేకరించింది. ఈ  డబ్బుతో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో లక్ష చదరపు అడుగులకుపైగా  ఆఫీస్ స్పేస్​ను కొంటామని తెలిపింది.  ఫ్రిక్షనల్​ ఓనర్​షిప్ కోసం పెట్టుబడిదారులకు కంపెనీ అందిస్తున్న మొదటి ఆస్తి ఇదే అని ప్రాపర్టీ  లోన్స్, బ్రోకరేజ్ వ్యాపారంలో ఉన్న స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. స్క్వేర్ యార్డ్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సేవలు,  డేటా ఇంటెలిజెన్స్ విభాగం ప్రాప్స్​ ఏఎంసీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన మొదటి గ్రేడ్ ఏ కమర్షియల్​ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించినట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో  తెలిపింది. 250  మంది పెట్టుబడిదారుల నుండి సగటున రూ. 40  లక్షల పెట్టుబడి పెట్టారని,  ఫ్రిక్షనల్​ ఓనర్​షిప్ బిజినెస్​లో ఇది తమకు తొలి వెంచర్ అని ప్రకటించింది.

పెట్టుబడిదారులు తమపై ఉంచిన నమ్మకం వల్లే రూ. 100 కోట్ల ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తి) మైలురాయిని చేరుకున్నామని స్క్వేర్ యార్డ్స్  సీఈఓ తనూజ్ షోరి అన్నారు. అద్దె ఆదాయం,  క్యాపిటల్​ పెంపు ద్వారా పెట్టుబడిదారులకు లాభదాయకమైన రాబడిని పొందడంలో సహాయపడటం ప్రధాన లక్ష్యమని అన్నారు.  టైర్-1 నగరాల్లో ఆస్తులను నిర్మించడం ద్వారా రాబోయే ఆరు నెలల్లో రూ. 1,000 కోట్ల ఏయూఎంకి చేరుకోవాలని  ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ కమర్షియల్ ప్రాపర్టీ పెట్టుబడిదారులకు 8 శాతం స్థూల రాబడిని అందిస్తుంది. పన్నులు పోగా ఎక్స్​ఐఆర్ఆర్​ (విస్తరించిన అంతర్గత రాబడి) 14–-15 శాతం ఉంటుంది.   భారత దేశంలో ఫ్రిక్షనల్​ ఓనర్​షిప్  మార్కెట్ చాలా ప్రారంభ దశలో ఉందని, మొత్తం 4-5 సంస్థల దగ్గర దాదాపు రూ. 1,200 కోట్ల ఏయూఎం ఉందని స్క్వేర్ యార్డ్స్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వీసెస్  డేటా ఇంటెలిజెన్స్ సీబీఓ ఆనంద్ మూర్తి అన్నారు. మైకేర్​ క్యాపిటల్​, స్ట్రాటా, హబైట్స్​, ప్రాప్​క్యాటలిస్ట్​ ఈ డొమైన్‌‌‌‌‌‌‌‌లో ప్రధాన కంపెనీలు.