అలంపూర్, వెలుగు: ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయమయ్యాయి. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం కంచుపాడుకు చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం బ్యాంక్‌కు వెళ్లి, తన ఖాతాలో డబ్బులు చెక్చేయించాడు. రూ.1.48 లక్షలు తగ్గడంతో.. అధికారులను ఆరా తీశాడు.
వారు ఈ నెల 3న మధ్యాహ్నం 12.30 గంటలకు డబ్బులు కట్అయినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై బాధితుడు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
