నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 150 కోట్లు

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 150 కోట్లు

హాలియా: నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. సోమవారం హాలియా సభలో మాట్లాడిన సీఎం.. నాగార్జున సాగర్ లో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కారోనా కారణంగా నాగార్జున సాగర్ కు రాలేకపోయానన్న సీఎం కేసీఆర్.. ప్రజలు చాలా ఇబ్డందులు పడుతున్నట్లు గుర్తించానన్నారు. హాలియాను అద్భుతంగా తయారు చేస్తానని.. నందికొండ మున్సిపాలిటీలో ఇరిగేషన్ కు సంబంధించిన స్థలాల్లో ఇల్లు కట్టుకున్నవారికి పట్టాలిస్తా అన్నారు. నెల రోజుల్లోనే నందికొండ మున్సిపాలిటీ ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాగర్ నియోజకవర్గంలో PHCలను అప్ గ్రేడ్ చేస్తానని తెలిపారు. నల్గొండ జిల్లాకు మొత్తం 15 లిప్టులు మంజూరు చేశామని..నెల్లికల్, కుంకుడు చెట్టు తండా లిప్టులు పూర్తి చేస్తామన్నారు. అలాగే హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిప‌ల్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించాల‌న్నారు.

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. సిబ్బంది, భ‌వ‌నం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయ‌తీరాజ్ రోడ్లు, క‌ల్వ‌ర్ట‌ల నిర్మాణానికి రూ. 120 కోట్ల‌ను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు సీఎం కేసీఆర్.