గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.19 కోట్ల బంగారం సీజ్..

గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.19 కోట్ల బంగారం సీజ్..

సినిమా ఫక్కీలో స్మగ్లింగ్..స్మగ్లర్ల కారువెనక పోలీసులు వాహనం.. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్..నాగ్పూర్, ముంబై, వారణాసి ప్రాంతాలలో పక్కా ప్లాన్ తో చేసిన ఆపరేషన్‌ నిర్వహించి దాదాపు 31.7 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం. పట్టుబడిన బంగారం విలువ రూ.19 కోట్లు. 

యూపీ లోని వారణాసిలో బంగారం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఆర్ ఐ బృందం.. స్మగ్లర్లు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. దాదాపు గంటల పాటు స్మగ్లర్ల కారును వెంబడించి చివరికి పట్టుకున్నరారు. కారు హ్యాండ్ బ్రేక్ కింద ఉన్న రంధ్రంలో బంగారం..18 కిలోలు బంగారు స్వాధీనం చేసుకున్నారు.యూపీ పోలీసుల సాయంతో డీఆర్ఐ బృదం అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. 

మరోచోట కోల్కతా నుంచి నాగ్పూర్ రైల్వే స్టేషన్లోకి రైలు దిగగానే ఇద్దరు వ్యక్తులను నాగ్ పూర్ డీఆర్ బృందం అరెస్ట్ చేసింది. పక్కా సమాచారంతో స్మగ్లింగ్ ముఠాను పట్టుకొని విదేశీ మార్క్తో కూడిన 8.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకుంది.  నిందితులను విచారణలో ఇద్దరు బంగారం తెప్పించుకున్న వ్యక్తులను కూడా గుర్తించారు. ఇంకోచోట రైలులో వారణాసినుంచి ముంబై చేరుకున్న  ఐదుగురు నిందితులను ముంబై డీఆర్ ఐ బృందం పట్టుకుంది. వారి నుంచి 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్ ద్వారా భారత్ లోకి తీసుకువచ్చిన బంగారాన్ని అక్రమంగా ముంబై, నాగ్ పూర్, వారణాసి వంటి దేశంలో వివిధ ప్రాంతాలకు స్మగ్లర్లు తరలిస్తున్నారు.  పక్కా ప్రణాళికతో 11 మందిని అరెస్ట్ చేసింది డీఆర్ ఐ బృందం. ముంబైలో ఇద్దరు,  వారణాసిలో ఇద్దరు, నాగ్ పూర్ లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.