
కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.19.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పారుపల్లి చెక్ పోస్ట్ వద్ద గురువారం తనిఖీలు చేస్తుండగా, మహారాష్ట్రలోని సిరొంచ నుంచి తెలంగాణ మీదుగా నాగపూర్ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారులో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.19.60 లక్షలు దొరికాయి. వాటిని తహసీల్దార్ రాఘవేంద్రరావుకు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్లవద్దని, అత్యవసరమైతే సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.