స్కూటీ డిక్కీలో నుంచి రూ.2లక్షలు చోరీ

స్కూటీ డిక్కీలో నుంచి రూ.2లక్షలు చోరీ

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కీ లోని రూ.2 లక్షలు  పట్ట పగలే గుర్తు తెలియని వ్యక్తులు  దొంగతనం చేసిన  ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కురవి మండలం బంచరాయి తండా కు చెందిన లూనావత్ గల్కీ మహబూబాబాద్​లో  స్వయం సహాయక సంఘం గ్రూప్ లీడర్ గా చేస్తోంది.

  ఈ క్రమంలో అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంజూరైన రూ.20 లక్షల రుణం డబ్బులను డ్రా చేసుకోవడానికి తన తమ్ముడి కుమారుడు రంజిత్​తో కలిసి బైక్​పై వచ్చింది. లోన్​ డబ్బులు సభ్యులు పంచుకున్న తర్వాత లూనావత్​గల్కీకి వచ్చిన   డబ్బులు రూ.2 లక్షలను తీసుకొని బైక్​ డిక్కీలో పెట్టారు. తరువాత ఇందిరా చౌక్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కు వెళ్లారు. 

ఈక్రమంలో బైక్​ను బ్యాంక్​ బయట పార్కు చేసి, లోపలికి వెళ్లి వచ్చారు.  బ్యాంక్​ పని పూర్తయ్యాక  బైక్​పై  తమ గ్రామానికి బయల్దేరారు.  గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ లో స్కూటీలో పెట్రోల్ పోయించుకునేందుకు దిక్కీ తెరువుగా అందు లోని రూ.2లక్షలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు తో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీ.సీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. .