
మావోయిస్ట్ కమాండర్ మల్లేష్కు చెందిన రూ. 2 వేల నోట్లను మార్చుతూ ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు చిక్కారు. రూ. 8 లక్షల విలువ గల రూ. 2 వేల నోట్లను మారుస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రూ. వేల నోట్లు పట్టించాయి...
రూ 2000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోగా రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సూచించింది. మే 18 నుంచి బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడికి అనుమతిచ్చింది. దీంతో ఛత్తీస్ గడ్ రాష్ట్రం బసగూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర మద్వి, లక్ష్మణ్ కుంజమ్‌లు...మావోయిస్టు కమాండర్కు చెందిన రూ. 2 వేల నోట్లను మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.8 లక్షల విలువ గల రూ. 2000 కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుతుండగా బీజాపూర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఎలా దొరికారంటే..
బసగూడ ప్రాంతానికి చెందిన గజేంద్ర మద్వి, లక్ష్మణ్ కుంజమ్ మావోయిస్ట్ కమాండర్ మల్లేష్ కు చెందిన రూ. 8 లక్షల విలువ గల రూ. 2 వేల నోట్లను మార్చేందుకు మహాదేవ ఘాట్ కు వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు పోలీసుల చెక్‌పాయింట్‌ను గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరు మావోయిస్ట్ కమాండర్ కు రూ. 2 వేల నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. మావోయిస్టు సానుభూతి పరుల నుంచి నుంచి రూ. 2000 నోట్ల మూడు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కటి మొత్తం రూ. 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన 11 పాస్‌బుక్‌లు, నక్సలైట్ల కరపత్రాలు స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్ష్నే తెలిపారు.
కొన్ని జమ చేశారు..
వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నక్సలైట్ కమాండర్ మల్లేష్ తమకు రూ.8 లక్షల రూ. 2000 నోట్లు ఇచ్చాడని గజేంద్ర మద్వి తెలిపాడు. ఇందులో రూ. 50 వేలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో..మరో రూ. 48 వేలను యూనియన్ బ్యాంక్‌లో జమ చేశామన్నారు. మరో 50 వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకులో రూ. 50 వేల చొప్పున జమ చేశామని వెల్లడించాడు.