
కాపలాగా ఉండాల్సిన సెక్యురిటి సిబ్బంది, గోదాములో పనిచేసే ఉద్యోగులు కలిసి సుమారు 2లక్షల విలువ చేసే 8 సెల్ ఫోన్ లను దొంగిలించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు పఠాన్ చెరు పోలీసులు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమెజాన్ గోదాం నందు సుమారు 2, 20,000 వేల విలువగల 8 ఫోన్లు గోదాం నుండి మిస్ అయ్యాయి. గోదాం లో పనిచేసే వ్యక్తుల పై అనుమానం వచ్చిన సెక్యూరిటీ మేనేజర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు గోదాంలో పనిచేసే సిబ్బందే ఈ చోరీకి పాల్పడ్డారని తేల్చేశారు. చోరీకి పాల్పడ్డ వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రోహిత్(19), షేక్ ఫైజల్ రాజన్ (23), నితీష్ కుమార్ యాదవ్ (19) , ఒడిషా రాష్ట్రానికి చెందిన అమృత్ మండల్ ( 22), దేవాశిష్ ఫరీదా(26), మధ్య ప్రదేశ్ కి చెందిన ప్రదీప్ తివారి(20) లు ఉన్నారు.
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించారు. వారి దగ్గర నుండి సుమారు రెండు లక్షల 20 వేల విలువైన 8 మొబైల్ లను స్వాధీనపరచుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.