గ్రీన్‌‌‌‌ ఎనర్జీలో అదానీ గ్రూప్‌‌‌‌ రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు

గ్రీన్‌‌‌‌ ఎనర్జీలో అదానీ గ్రూప్‌‌‌‌ రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: రెన్యువబుల్ ఎనర్జీ బిజినెస్‌‌‌‌ను విస్తరించడానికి 2030 నాటికి రూ.2.3 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌‌‌‌ చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది.   గుజరాత్‌‌‌‌ కచ్‌‌‌‌లోని ఖవ్డాలో  సోలార్, విండ్‌‌‌‌ కరెంట్‌‌‌‌ ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 2 గిగా వాట్ల నుంచి 30 గిగా వాట్లకు పెంచాలని చూస్తోంది. ఇందుకోసం అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. మరో రూ.50 వేల కోట్లను దేశంలోని ఇతర రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేస్తామని  వివరించింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్‌‌‌‌ 6–7 గిగా వాట్లకు పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ సబ్సిడరీ అదానీ న్యూ ఇండస్ట్రీస్‌‌‌‌ గుజరాత్‌‌‌‌లోని ముంద్రాలో  సోలార్ సెల్‌‌‌‌, విండ్‌‌‌‌ టర్బైన్‌‌‌‌లను తయారు చేయడానికి రూ.30 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. 

అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం  10.93 గిగా వాట్ల కెపాసిటీ ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌‌‌‌లను మేనేజ్ చేస్తోంది. ఈ కెపాసిటీని 2030 నాటికి 45 గిగా వాట్లకు పెంచాలని  టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. ఇందులో 30 గిగా వాట్లు  ఖవ్డా లొకేషన్‌‌‌‌లో ఉత్పత్తి కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌‌‌‌ను ఇక్కడ అదానీ గ్రూప్  నిర్మిస్తోంది. తాజాగా ఖవ్డాలో 2 గిగావాట్ల ప్రొడక్షన్‌‌‌‌ను మొదలు పెట్టామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 4 గిగా వాట్లను యాడ్ చేస్తామని అదానీ గ్రీన్ ఎనర్జీ పేర్కొంది.