బాధిత మహిళకు ఎల్వోసీ అందజేత

బాధిత మహిళకు ఎల్వోసీ అందజేత

జైపూర్ (భీమారం), వెలుగు : భీమారం మండల కేంద్రానికి చెందిన సెగ్యం లక్ష్మికి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం నుంచి ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్​నాయకులు బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కొక్కుల నరేశ్, కోట రమేశ్, ఆవిడపు మహేశ్, జరుపుల రమేశ్, పుట్ట కుమార్ పాల్గొన్నారు.