ముంబైలో అంతే : అలాంటి ఆటోలపై రోజుకు 50 రూపాయల ఫైన్

ముంబైలో అంతే : అలాంటి ఆటోలపై రోజుకు 50 రూపాయల ఫైన్

మహనగరాల్లో ఆటోవాలాల కష్టాలు గురించి మనకు తెలియందుకాదు..పొద్దంతా ఆటో నడిపితే వచ్చే డబ్బులతో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కిరాణా సరుకులు ఇలా వచ్చిందంతా క్షణాల్లో ఖర్చయి పోతుంటుంది.. నెల ముగిసాక ఏం సంపాదించాం అని చూసుకుంటే మిగిలింది ఏమీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆటో డ్రైవర్లకు ఆర్టీఓ వసూళ్లు మరింత భారంగా తయారయ్యాయి. ఈ రూల్స్ ఆ రూల్స్ అంటూ.. ఆటోవాలాల నుంచి బాదడే బాదుడు.. ముంబై నగరంలో ఆటోవాలాలకు ఇటీవల ఆర్టీవో అధికారులు జారీ చేసిన ఆర్డర్ మరింత భారంగా మారింది. 

రోడ్ సేఫ్టీకి అవసరమైన ఫిట్ నెస్ లేని ఆటో రిక్షాలు, ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు పై రోజు రూ. 50 చొప్పున జరిమానా విధిస్తూ మహారాష్ట్ర రవాణ శాఖ సోమవారం (మే 27) ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై, దాని మెట్రోపాలిటన్ రీజియన్ లోని 10 శాతం దాకా ఆటోరిక్షాలకు ఈ సర్టిఫికెట్లు లేవని ఈ జరిమానా విధించింది. 2016 నుంచి వాటిని వాటిని రెన్యువల్ చేయకుండా కొంతమంది ఆటోవాలాలు నిర్లక్ష్యంగా ఉన్నారని రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. 

అసలు కథ.. 

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం..తప్పనిసరిగా వాహనాల ఫిట్ నెస్ తనఖీలు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయడంలో వాహనదారులు విఫలం అయితే రోజుకూ రూ. 50 చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన 2017 అక్టోబర్ లో హైకోర్టులో సవాల్ చేయబడింది. ఇటీవల అంటే 2023 ఏప్రిల్ లో ఈ యాక్టును అమలు చేయొచ్చని కోర్టు తీర్పునిచ్చింది. 

అయితే అప్పటినుంచి ముంబైలోని ఆటోవాలాలు ఈ సర్టిఫికెట్ రెన్యువల్ చేయలేదని ఆర్టీవో అధికారులు అంటున్నారు. యాక్టు అమలుపై కోర్టు తీర్పు రావడంతో తిరిగి ఈ సర్టిఫికేషన్ లేని ఆటోలకు రోజుకు రూ. 50 చొప్పున జరిమాని వసూలు చేయాలని మహారాష్ట్ర రవాణా శాఖ ఆర్టీవో అధికారులు ఆదేశాలు జారీ చేసింది. 

పెనాల్టీపై కార్మిక సంఘాల నేతలు 

కోవిడ్ తర్వాత చలా మంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాహన రుణాలు చెల్లించలేక, కొందరు డ్రైవర్లు డ్రైవింగ్ కూడా మానేశారు.. చాలా మందికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. రోజూ రూ. 50 జరిమానాపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆటో డ్రైవర్ యూనియన్ల నేతలు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. 

ఆర్టీవో అధికారులు ఏమంటున్నారంటే.. 

ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిబంధనలు తప్పని సరిగా అమలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.. ఇది పర్మిట్ హోల్డర్లలో ఎక్కువ బాధ్యతను అమలు చేస్తుందని. ప్రయాణికుల భద్రతను పెంచుతుందని అధికారులు అంటున్నారు.