ఆపరేషన్ సిందూర్ సక్సెస్ తో ఇండియన్ ఆర్మీకి రూ. 50 వేలు కోట్లు..

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ తో ఇండియన్ ఆర్మీకి రూ. 50 వేలు కోట్లు..

పహల్గాం ఉగ్రదాడితో భారత్,పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతల గురించి తెలిసిందే.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ తో ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ సక్సెస్ భారత దళాలకు బిగ్ బాస్ ఇచ్చిందని తెలుస్తోంది.. భారత దళాల బడ్జెట్ రూ. 50 వేల కోట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కేటాయించిన రూ. 7 లక్షల కోట్లకు అదనంగా సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా రూ. 50 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025 - 26 బడ్జెట్‌లో సాయుధ దళాల కోసం రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం కేటాయింపులు ఇప్పటికే 2024 - 25లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లకు 9.2 శాతం పెరిగింది. ఈమేరకు పెరిగిన బడ్జెట్ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదం పొందుతుందని.. రీసర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆయుధాల కొనుగోలు, అవసరమైన పరికరాల సమీకరణకు ఈ బడ్జెట్ వాడనున్నట్లు సమాచారం.ప్రస్తుత కేటాయింపుల ప్రకారం మొత్తం బడ్జెట్లో 13 శాతం రక్షణ శాఖకు కేటాయించినట్లు అవుతుంది.

ముఖ్యంగా ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత దళాల సామర్థ్యం నిరూపితమైంది. ఇదే అదనపు బడ్జెట్ దిశగా కేంద్ర నిర్ణయానికి కారణమని చెప్పచ్చు.