
- ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం
- రూ.659.97 కోట్లతో పనులు
- జిల్లా కేంద్రాలకు లింక్ కానున్న గ్రామీణ రోడ్లు
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో రహదారుల అభివృద్ధికి హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్ బీ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 572. 32 కిలోమీటర్ల పొడవుతో 30 రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.659.97 కోట్లతో అంచనాలు రూపొందించగా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హ్యామ్ఫస్ట్ఫేజ్లో ఈ పనులన్నింటినీ ఆర్అండ్ బీ శాఖ చేపట్టబోతోంది. సంబంధిత కాంట్ట్రాక్ట్ ఏజెన్సీకి పనులు అప్పగించనుంది. కొత్తగా రోడ్లు నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడం, పూర్తిస్థాయిలో రిపేర్చేయనున్నారు. ఫలితంగా గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ఆదిలాబాద్ సర్కిల్ లో..
ఆదిలాబాద్ ఆర్అండ్ బీ సర్కిల్ పరిధిలో నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 313.09 కిలోమీటర్ల పొడవుతో 18 రోడ్లు నిర్మించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాప్రి, బాలాపూర్, సవాపూర్, పెండల్వాడ, కౌట, అనంద్ పూర్, కుర వరకు, ఆదిలాబాద్ నుంచి కెరమెరి వరకు, బోథ్పరిధిలోని వాంకిడి నుంచి మహబూబ్ ఘాట్ వరకు, ఇచ్చోడ నుంచి సిరి చెల్మ వయా మంకాపూర్, నర్సాపూర్, చించోలి, జామిడి వరకు, గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వరకు రోడ్ల పనులు చేపట్టనున్నారు.
వీటితోపాటు ఆదిలాబాద్ నుంచి తలాయిగూడ రోడ్వయా రాంపూర్, పొన్నారి రోడ్, హస్నాపూర్, సుంకిడి, లక్ష్మీపూర్ వరకు, ఖానాపూర్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వరకు, ఉట్నూర్నుంచి ఇంధన్ పల్లి వరకు రోడ్లు నిర్మించనున్నారు.
నిర్మల్ టౌన్ లిమిట్స్ వరకు..
నిర్మల్ జిల్లాలోని వాకిడి కడ్తాల్ సెక్షన్ పరిధిలో నిర్మల్ టౌన్ లిమిట్స్ వరకు, నిర్మల్ అప్పారావుపేట రోడ్డు వయా చించోలి బి, సాయి నగర్, ధని, జామ్, సారంగాపూర్, కౌట్ల బి, స్వర్ణ, రామ్ సింగ్ తండా, సిరిపల్లి వరకు, సిర్గాపూర్ నుంచి కాలువ తండా, కాల్వ, బిరవెల్లి, వంజర్, చించోలి(ఎం) మీదుగా కౌట్ల వరకు, ముథోల్ నియోజకవర్గంలోని అర్లీ లోకేశ్వరం రోడ్, బైంసా నుంచి కుబీర్ వరకు గొడిసెరా, బాకోట్, పాంగ్రా, పార్డి, పల్సి, సిరిపల్లి మీదుగా రోడ్డు నిర్మించనున్నారు.
అలాగే ముథోల్ నుంచి తానూర్ వరకు సింగన్ గావ్, జెవ్లా, వడ్గం మీదుగా, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్–బెల్లాల్ రోడ్డు వయా తర్లపా డు, దిలావర్పూర్, మల్లాపూర్, లింగాపూర్, ఎలగడప, మద్దిపడగ, చిట్యాల, పెద్ద బెల్లాల్, నర్సింగాపూర్ మీదుగా రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఖానాపూర్–తర్లపాడు రోడ్డును కూడా నిర్మించనున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
హ్యామ్ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొత్తం 12 రో డ్లను 259.23 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.294.29 కోట్లతో ఆర్అండ్ బీ అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించింది.