ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు

ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్  ప్రవేశ పెట్టారు. ఇందులో ఆరోగ్య రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయించారు. జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం ప్రవేశ పెడతామన్నారు. జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు. 2025 లోపు క్షయ నిర్మూలిస్తామన్నారు.  వైద్య పరికరాల కొనుగోలుపై వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వచ్చే సొమ్మును దేశ వ్యాప్తంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి.. అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఆయుస్మాన్ భారత్ కింద జిల్లాల వారీగా మరిన్ని హాస్పిటల్స్ కడతామన్నారు. దేశ వ్యాప్తంగా జనరల్ డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత ఉందన్నారు. పీపీపీ విధానంలో జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలను అనుసంధానించి దీన్ని అధిగమిస్తామన్నారు. ఈ స్కీమ్ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో విధి విధానాలు ఖారారు చేస్తామన్నారు.