రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా మన ఊరు - మన బడి పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. సర్కారీ బడుల్లో దశలవారీగా అభివృద్ధి పనుల కోసం బడ్జెట్లో రూ. 7,289 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మండలాన్ని యూనిట్గా తీసుకుని రాష్ట్రంలోని 9,123 స్కూళ్లలో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీ
రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోఠి మహిళా కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు ప్రతిపాదించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సర్కారు ఇందుకోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. 

రెండేళ్లలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు
రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో రానున్న రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ ఏడాది కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోటి చొప్పున 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమైంది. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణ పేట, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం రూ. 100కోట్లు కేటాయించింది. 

మరిన్ని వార్తల కోసం..

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ద‌ళిత బంధు ప‌థ‌కానికి భారీగా నిధులు