మానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. రూ.77 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్రం

మానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. రూ.77 కోట్లు శాంక్షన్ చేసిన కేంద్రం
  • నెరవేరనున్న గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ
  • వేములవాడ- సిరికొండ రోడ్డుకు రూ.23 కోట్లు 
  • ఆర్నకొండ-మల్యాల రోడ్డు విస్తరణకు రూ.50 కోట్లు 
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

కరీంనగర్, వెలుగు: గన్నేరువరం– కరీంనగర్ మధ్య సుమారు 25  కిలోమీటర్ల దూరాన్ని తగ్గించేలా చొక్కారావుపల్లి–ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. నిర్మాణ పనులకు రూ.77 కోట్లు  మంజూరు చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అలాగే  చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు దాదాపు 35 కి.మీల మేర డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు, వేములవాడ నుంచి సిరికొండ వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.23 కోట్లు విడుదల చేశారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న హైలెవల్ బ్రిడ్జి, డబుల్ రోడ్డు నిర్మాణాలతో 30 గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. 

గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ 

మానేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గన్నేరువరం వాసులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే సుమారు 25 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లేవనెత్తుతూనే ఉన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంపీగా తాను గెలిస్తే బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో హామీ ఇచ్చారు.

 నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా..  అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓకే చెప్పారు.

 మానేరు నదిపై చొక్కారావుపల్లి– ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు గుండ్లపల్లి–పోతూరు రోడ్డు, బావుపేట–- ఖాజీపూర్ రోడ్డు నిర్మాణంతో గన్నేరువరంతోపాటు బెజ్జంకి, ఇల్లంతకుంట, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. ఈ బ్రిడ్జి లేకపోవడంవల్ల గన్నేరువరం నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రావాలంటే చుట్టూ దాదాపు 40 కి.మీలు తిరిగి రావాల్సి వస్తోంది. 

ఆర్నకొండ–మల్యాల రోడ్డు విస్తరణ

చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు దాదాపు 35 కి.మీల మేర సింగిల్ రోడ్డు ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలుమార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన చొరవతో కేంద్ర ప్రభుత్వం సీఆర్ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.50 కోట్లు మంజూరు చేసింది.  దీంతో అర్నకొండ, రాగంపేట, కుర్మపల్లి, తిర్మల పూర్, బూరుగుపల్లి, ర్యాలపల్లి, తాటిపల్లి, ముత్యంపేట, మల్యాల క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.  

వేములవాడ టు సిరికొండ రోడ్డు..

వేములవాడ నుంచి సిరికొండ మధ్య దాదాపు 76 కి.మీల దూరం ఉంది. వేములవాడ నుంచి దాదాపు 18.2 కి.మీల మేరకు రోడ్డును నిర్మించాలనేది ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల కల.  ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ సమస్య బండి సంజయ్ కుమార్ దృష్టికి రాగా.. రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు పంపించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రోడ్ల శాఖ మంత్రి రూ.23 కోట్లు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వెళ్లేందుకు దగ్గరి మార్గం కానుంది. 

వేములవాడ, హన్మాజీపేట, చందుర్తి మండలం యెన్గల్, బండపల్లి, కోనరావుపేట మండలం బావుసాయిపేట, వట్టిమల్ల, మర్రిమడ్ల గ్రామాలతోపాటు నిజామాబాద్ జిల్లా చీమన్ పల్లి, సిరికొండ వరకు వెళ్లే అవకాశముంది.  

కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటా

మానేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, వేములవాడ-–సిరికొండ,  ఆర్నకొండ– మల్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు  ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. రాజకీయాలకు తావులేకుండా పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి అన్ని పార్టీల నేతలను కలుపుకుపోతున్నా. -బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

నిధులు మంజూరు చేయడం హర్షణీయం

చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామం నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు దాదాపు 35 కి.మీల మేర సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరించడానికి సీఆర్ఏఎఫ్ పథకంలో భాగంగా రూ.50 కోట్లు మంజూరు కావడం సంతోషంగా ఉంది. నా విజ్ఞప్తికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్డు ప్రతిపాదనలు పంపిన సీఎం రేవంత్ రెడ్డి, సాంక్షన్ చేయించిన కేంద్రమంత్రి  బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు -మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే