ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో టీమ్‌‌కు రూ.90 కోట్లు

ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో టీమ్‌‌కు రూ.90 కోట్లు
  • ఒక్కో టీమ్‌‌కు రూ.90 కోట్లు
  • ఆక్షన్‌‌లో ప్లేయర్ల కొనుగోలుకు శాలరీ క్యాప్‌‌
  • నలుగురిని రిటైన్‌‌ చేసుకుంటే రూ. 42 కోట్లు కోత

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌15వ సీజన్‌‌‌‌ కోసం జరిగే మెగా ఆక్షన్‌‌‌‌, ప్లేయర్ల రిటెన్షన్‌‌‌‌ పాలసీపై పూర్తి స్పష్టత వచ్చింది. ఆక్షన్‌‌‌‌లో ఒక్కో టీమ్‌‌‌‌ రూ. 90 కోట్లు ఖర్చు చేయొచ్చని, పది ఫ్రాంచైజీలకు  ఇదే శాలరీ పర్స్‌‌‌‌ అని బీసీసీఐ తెలిపింది. ఎనిమిది పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను రిటైన్‌‌‌‌ చేసుకునేందుకు బోర్డు అవకాశం ఇచ్చింది. ‘నలుగురిని రిటైన్‌‌‌‌ చేసుకుంటే  రూ. 42 కోట్లు, ముగ్గురిని రిటైన్‌‌‌‌ చేసుకుంటే రూ. 33 కోట్లు కేటాయించాలి. అదే ఇద్దరికైతే రూ. 24 కోట్లు, ఒక్కరినే రిటైన్‌‌‌‌ చేసుకుంటే రూ. 14 కోట్లు సదరు ఫ్రాంచైజీ శాలరీ పర్స్‌‌‌‌ నుంచి తీసివేయాల్సి ఉంటుంది’ అని ఐపీఎల్‌‌‌‌ సీనియర్‌‌‌‌ అధికారి ఒకరు చెప్పారు. కాగా, పాత ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌ను వెల్లడించిన తర్వాత  ఆక్షన్‌‌‌‌ పూల్‌‌‌‌లోకి వచ్చే ప్లేయర్ల నుంచి కొత్త టీమ్స్‌‌‌‌ అహ్మదాబాద్‌‌‌‌, లక్నో ముగ్గురిని ఎంచుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక, పాత ఫ్రాంచైజీ నలుగురిని రిటైన్‌‌‌‌ చేసుకోవాలనుకుంటే.. ఇద్దరు ఇండియన్స్‌‌‌‌, ఇద్దరు ఫారినర్స్‌‌‌‌ లేదా ముగ్గురు ఇండియన్స్‌‌‌‌, ఒక ఫారినర్‌‌‌‌ను తీసుకునే సౌకర్యం కల్పించారు. కొత్త టీమ్స్‌‌‌‌ ఆక్షన్‌‌‌‌ పూల్‌‌‌‌ నుంచి ఇద్దరు ఇండియన్స్‌‌‌‌, ఒక ఫారిన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ను ఎంచుకునే చాన్స్‌‌‌‌ ఇచ్చారు.