సిద్దిపేట కలెక్టర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

సిద్దిపేట కలెక్టర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామన్న సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ వ్యాఖ్యలకు  కౌంటర్ ఇచ్చారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి మాటలు విని 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 20 గ్రామాలను ముంచేసి  ప్రజలను నిర్వాసితులను చేసిన కలెక్టర్ ..ఇపుడు వరి విత్తనాలు అమ్మితే శిక్షిస్తానని వార్నింగ్ ఇస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. రైతులు వరి వేయొద్దని.. లిఫ్ట్ చేసి తచ్చిన మల్లన్న సాగర్ నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా? అని ప్రశ్నించారు.