ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ..కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదు?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ..కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదు?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పిఏలు స్వయంగా రూ.45 కోట్లు ఢిల్లీకి తరలించి ముడుపులు చెల్లించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపినా..ఈడీ ఎందుకు అరెస్టు చేయడంలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 25వ తేదీన ఆదిలాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద బీఅర్ఎస్ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డోకే రాజన్న,బీఅర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు నీలా గౌడ్, స్థానిక సర్పంచ్ ప్రసాద్ అధ్వర్యంలో 200 మందికి పైగా బీఎస్పీలో చేరారు. ఈ సందర్బంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో నగదు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని  కవిత పీఏలు అందించినా ఆమెను అరెస్టు చేయడంలో కేంద్రం ఎందుకు వెనకడుగువేస్తుందని నిలదీశారు. 

దిందా వాగు ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడ్డా స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ప్రజల బాధలు పట్టించుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2017 లోనే దిందా వాగుపై రూ.2 కోట్లతో వంతెనల నిర్మాణానికి  భూమి పూజ చేసినా ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మించలేదన్నారు. ముత్తంపేట అక్రమ క్వారీ తవ్వకాల వల్లే కొత్తగూడెం క్రాస్ రోడ్ నుంచి గూడెం వరకు 40 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వాన్నంగా తయారైందన్నారు. గ్రానైట్ క్వారీల అక్రమ రవాణా వెనుక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం ఉందని ఆరోపించారు. నియోజవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీబీవిలో విద్యార్థుల మౌలిక సమస్యలు తీర్చడంలో ఎమ్మ్యేలేకు చిత్తశుద్ధిలేదన్నారు.

Also Read :- తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు..

సిర్పూర్ నియోజవర్గంలో విద్య,వైద్యం లేక ప్రజలు అనేక అవస్థలుపడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్థానిక యువకులపై ఎమ్మెల్యే అక్రమ కేసులతో భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.  బీఎస్పీలో చేరే యువకులను ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అపహరించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.