రాష్ట్రం ఏర్పడి10 సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి మార్పు లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రం ఏర్పడి10 సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి మార్పు లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ  ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి మార్పు లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2023 జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలను, రైతులను, నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ గాలికొదిలేసిందని అరోపించారు. 

రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందని  ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. కానీ ఇప్పుడు అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కాం, లిక్కర్ స్కాం, లీకేజీ స్కాంగా మారిందన్నారు. TSPSC పేపర్ లీకేజీతో అభ్యర్థుల భవిష్యత్తు  గందరగోళంగా మారిందన్న ప్రవీణ్ కుమార్.. నిజమైన దోషులను వదిలేసి అమాయకులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.  ఈ కేసులో TSPSC కమిషన్ సభ్యులను సిట్ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

పేపర్ లీకేజీ కేసులో సీఎం  కేసీఆర్ తో పాటుగా ఆయనకు చెందిన వ్యక్తుల హస్తం ఉందని   ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  జూన్ 11 న జరగబోయే గ్రూప్ 1  పరీక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రద్దు చేసే దాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు.