పాతబస్తీలో గన్ తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య

పాతబస్తీలో గన్ తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య

హైదరాబాద్ సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గన్ తో కాల్చుకుని RSI ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టిఎస్ఎస్ పి రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం తెల్లవారుజామున తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా పోలీసులు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.