దేశ శ్రేయస్సే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు

 దేశ శ్రేయస్సే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు
  • ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, వెలుగు: దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పథసంచాలన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వందేళ్లుగా ఆర్ఎస్ఎస్ దేశ అభ్యున్నతికి పనిచేస్తూ, ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటుందని కొనియాడారు. గ్రూపులుగా విడిపోయిన వామపక్షాలకు ఆర్ఎస్ఎస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. దేశ సేవకు అంకితం అవుతూ భావి భారత పౌరులను అందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి మరువలేనిదన్నారు.

సంగారెడ్డి టౌన్, సదాశివపేట: బానిసత్వపు భావజాలం నుంచి స్వాభిమానం దిశగా దేశ ప్రజలను జాగృతం చేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ యోగి అన్నారు. ఆదివారం సంగారెడ్డి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పథ సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ యోగి మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ, స్వయం సమృద్ధి, విశ్వ గురు స్థానం కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. 

ముఖ్య అతిథి రాథోడ్ ప్రకాశ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్​గా తాను ఎంతో గర్వపడతానని ఇదే స్ఫూర్తితో భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, వివిధ బస్తీలకు చెందిన స్వయంసేవకులు పాల్గొన్నారు. 

కదం తొక్కిన స్వయం సేవకులు

జిన్నారం: మండల కేంద్రమైన జిన్నారం, బొల్లారంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు శత జయంతి వేడుకల్లో భాగంగా భారీ పథ సంచాలన్ నిర్వహించారు. మున్సిపాలిటీ కేంద్రంలోని పుర వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం ఆర్ఎస్ఎస్  ముఖ్య అతిథి రవి కుమార్ మాట్లాడుతూ హిందూ సమాజం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. 

కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి అధ్యక్షుడు ఆనంద్ చారి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టెంట్ శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు బ్రహ్మేందర్, సంగ్ ప్రముకులు భాస్కర్, వినోద్ రెడ్డి, మధు, శ్రీకాంత్,  వేణు పాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, రమేశ్, శ్రీధర్, రమేశ్, శ్రీనివాస్, కుమార్ సాగర్ పాల్గొన్నారు. 

వర్గల్​లో సంఘ్​ పథ సంచాలన్ ర్యాలీ 

గజ్వేల్​/వర్గల్: సామాజిక సమరత సాధన, దేశభక్తి, వ్యక్తి నిర్మాణం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్​ ముందుకు సాగుతోందని హిందూ వాహిని మెదక్ విభాగ్ ప్రముఖ్​ ఎల్లగొని సత్యంజి, ముఖ్యఅతిథి పురుషోత్తం అన్నారు. ఆదివారం మండల కేంద్రం వర్గల్​లో ఆర్ఎస్​ఎస్​ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి ఉత్సవం, అనంతరం పథ సంచాలన్​ ఘనంగా నిర్వహించారు.