ఈనెల 6న తమిళనాడులో ఆర్ఎస్ఎస్ భారీ ర్యాలీ

ఈనెల 6న తమిళనాడులో ఆర్ఎస్ఎస్ భారీ ర్యాలీ

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుదుచ్చేరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) భారీ ర్యాలీ నిర్వహించింది. కామరాజర్ రోడ్డు నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ప్రధాన వీధుల గుండా కడవలూరు రోడ్డులోని సింగర వేలర్ విగ్రహం వరకు ఈ యాత్ర కొనసాగింది. అనంతరం సాయంత్రం భారీ బహిరంగ సభ ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ ర్యాలీ సందర్భంగా పుదుచ్చేరిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మతఘర్షణలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి. 

అయితే ఇదే రోజు తమిళనాడులో ర్యాలీకి ఆర్ఎస్ఎస్ అనుమతి కోరగా.. స్టాలిన్ సర్కార్ నిరాకరించింది. విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఆర్ఎస్ఎస్.. ఈనెల 6న నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. ఈనెల 6న తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ భారీ ర్యాలీ నిర్వహించనుంది.