విద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ

విద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ
  • విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు

పాలక్కాడ్: కేరళలో ఘోర  రోడ్డు ప్రమాదం  జరిగింది. పలక్కాడ్ జిల్లా లోని వడక్కెంచేరిలో జరిగిన బస్సు యాక్సిడెంట్ లో 9మంది చనిపోగా..మరో 38మందికి గాయాలయ్యాయి. ఎర్నాకులం జిల్లాలోని  ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో ఊటీ టూర్ కు వెళ్తోన్న టూరిస్ట్ బస్సు ... కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సును వడక్కెంచేరి దగ్గర లో అర్ధరాత్రి ఢీకొంది. టూరిస్టు బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు.. ఆర్టీసీ బస్సులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారిలో 12మందికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.