గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

గుండెపోటుతో విధుల్లోనే  ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి సంగారెడ్డి నుండి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కు బస్సులో వెళుతున్న టైమ్ లో కండక్టర్ భిక్షపతికి ఛాతీలో నోప్పి వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 11:30 గంటల సమయంలో చనిపోయాడు. భిక్షపతి స్వస్థలం సిద్దిపేటలోని ఎండపల్లి గ్రామం. భిక్షపతి మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.