పెండింగ్ ‌‌బిల్లులు రూ.100కోట్లు చెల్లించండి

పెండింగ్ ‌‌బిల్లులు రూ.100కోట్లు చెల్లించండి

ప్రగతి భవన్ గేటుదాక చొచ్చుకెళ్లిన
ఆర్టీసీ హైర్‌‌‌‌ బస్సుల ఓనర్లు
అడ్డుకున్న పోలీసులు..300 మందికిపైగా అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: నాలుగు నెలలుగా తమకు పెండింగ్‌లో పెట్టిన రూ.100 కోట్ల బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ఓనర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది దాకా ఉదయం8 గంటలకు ప్రగతి భవన్‌‌‌‌ను ముట్టడించేందుకు తరలివచ్చారు. సుమారు 100 మంది చొప్పున ఒక్కో బ్యాచ్ ప్రగతి భవన్ గేట్ వరకు దూసుకొచ్చింది. పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్ట్చేసి గోషామహల్ ఠాణాకు తరలించారు. దీంతో వారంతా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, ఆర్సీ మేనేజ్‌ టీ మెంట్‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

సాయంత్రం తర్వాత వారిని వదిలిపెట్టారు. మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మే 19 నుంచి గ్రేటర్, అంతర్రాష్ట్ర సర్వీసులు మినహా జిల్లాల్లో కొన్ని బస్సులు నడుస్తున్నాయి. నడుస్తున్న వాటిలో ప్రైవేట్ హైర్ బస్సులు 20శాతం వరకున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలుగా రూ.100 కోట్లవరకు బిల్లులు బకాయి ఉన్నాయి. దీంతో బస్సుల ఈఎంఐ, డ్రైవర్ల‌కు జీతాలు కూడా చెల్లించలేక పోతున్నామని ఓనర్లు వాపోతున్నారు.

సమ్మె టైమ్‌‌‌‌లో వాడుకొని వదిలేశారు..

సమ్మె టైమ్‌లో సర్కార్‌ ‌‌తమను వాడుకొని ఇప్పుడు వదిలేసిందని ఓనర్లు మండిపడుతున్నారు. ‘‘ఆర్టీసీలో 3300ప్రైవేట్ హైర్ బస్సులున్నాయి . 15వేల కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ద‌కంగా మారుతుంది’’ అని తెలంగాణ హైర్ ‌‌‌‌బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్కం ప్రభాకర్, జీహెచ్‌‌‌‌ఎంసీ జోన్ ఆర్గ‌నైజింగ్ సెక్రటరీ జగదీశ్‌‌‌‌రెడ్డి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..