కర్ణాటక శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ ను లాగి అవతల పడేశారు

కర్ణాటక శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ ను లాగి అవతల పడేశారు

కర్ణాటక శాసన మండలి సమావేశాల్లో హైడ్రామా కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య వైరం…. మండలిలో రాజకీయ మంట రాజేసింది. చైర్మన్ సీట్లో  కూర్చునే అర్హత లేదంటూ… శాసనమండలి సభాపతితో అమర్యాదగా ప్రవర్తించారు కాంగ్రెస్  ఎమ్మెల్సీలు.  చైర్మన్ ను కుర్చీనుంచి బలవంతంగా లాగీ.. అవతలకు నెట్టేశారు.

బీజేపీ, జేడీఎస్ రెండు పార్టీలు కలిసి… ఇల్లీగల్ గా డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడను చెయిర్ లో కూర్చేబెట్టేందుకు ట్రై చేశాయని కాంగ్రెస్ విమర్శించింది. హౌజ్ ఆర్డర్ లో లేనప్పుడు ఈ చర్యకు బీజేపీ, జేడీఎస్ ప్రయత్నించాయన్నారు. చెయిర్ లో కూర్చునే అర్హతలేదని కాంగ్రెస్ కోరుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గూండాల్లాగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్సీలు అన్నారు. మండలి చరిత్రలోనే ఇది సిగ్గుపడాల్సిన రోజన్నారు.