
కన్నడ హీరోయిన్ అయినప్పటికీ ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీతో తెలుగు, తమిళ భాషల్లోనూ చక్కని ఆదరణను అందుకుంది రుక్మిణీ వసంత్. ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న‘కాంతార ఛాప్టర్ 1’లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల తన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే హ్యూజ్ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార, కియారా అద్వాని, హ్యూమా ఖురేషి, తారా సుతైరా హీరోయిన్స్‌గా నటిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. తాజాగా రుక్మిణీ వసంత్ కూడా ఈ వరుసలో చేరింది. అయితే మిగతా వాళ్లంతా ఇతర భాషల హీరోయిన్స్ కాగా, రుక్మిణీ మాత్రం శాండిల్ వుడ్‌కు చెందిన హీరోయిన్ కావడం విశేషం.
►ALSO READ | Actor Achyut Potdar: చికిత్స పొందుతూ ప్రముఖ నటుడు కన్నుమూత.. 125కి పైగా సినిమాల్లో తనదైన ముద్ర
ఇప్పటికే తన క్యారెక్టర్‌కు సంబంధించి కొంత షూటింగ్ కూడా జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న సినిమా విడుదల కానుంది.
ఇక విజయ్ సేతుపతికి జంటగా ‘ఏస్’చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణీ వసంత్.. శివకార్తికేయన్‌కు జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే టాక్ ప్రచారంలో ఉంది.